TG: ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి చికితకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. చికితతో పాటు సాహిల్ జాదవ్‌ను అభినందించారు. ఆసియా క్రీడల్లో ఒకేరోజు 2 స్వర్ణాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. ఆర్చరీ క్రీడాకారిణి చికిత రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారన్నారు. చికిత విజయం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.