తగ్గుతున్న కాకుల సంఖ్య.. సర్వే ప్రారంభం

8705చూసినవారు
తగ్గుతున్న కాకుల సంఖ్య.. సర్వే ప్రారంభం
TG: కాకుల సంఖ్య తగ్గుతోందన్న ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్ బర్డ్ అట్లాస్ శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. ఈ నెల 4న మొదలై 26వ తేదీ వరకు కొనసాగే ఈ సర్వేను డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, దక్కన్ బర్డర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, తెలంగాణ అటవీ శాఖ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ సర్వే ద్వారా నగరంలోని పక్షి జాతులను నమోదు చేసి, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సర్వేల్లో 195 రకాల పక్షులు నగరంలో ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్