
తిరుపతి SV వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు
AP: తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశ్వవిద్యాలయ సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే, హెలిప్యాడ్ వద్ద ఐఈడీ బాంబులు ఉంచినట్లు వచ్చిన ఈమెయిల్‌తో భద్రతా విభాగం అప్రమత్తమైంది. వెంటనే బాంబు స్క్వాడ్, పోలీసు బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. భద్రతా కారణాల దృష్ట్యా హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది.




