శీతాకాలంలో దోమలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి మార్కెట్‌లో దొరికే రసాయన స్ప్రేలు వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సహజ వెల్లుల్లి స్ప్రే తయారు చేసి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 మిరపకాయలు రుబ్బి, ఒక లీటరు నీటిలో వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోయాలి. కీటకాలు కనిపించే చోట రోజుకు 2-3 సార్లు పిచికారీ చేస్తే కీటకాలు దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.