
అమెరికా ఎన్నికల ఫలితంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమిపై ఇరాన్ దేశం స్పందించింది. ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తమ ఓట్ల ద్వారా వారు యుద్ధం వద్దు అని చెప్పారని ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ అన్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయంతో విసిగిపోయిన అమెరికన్లు ట్రంప్ విధానాలను తిరస్కరించారని ఆయన తెలిపారు. ప్రజా తీర్పును గౌరవించి ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలని, లేదంటే ట్రంప్ మొండి వైఖరి అమెరికాకు పీడకలగా మారుతుందని ఆయన హెచ్చరించారు.




