
12న సూర్య గ్రహణం.. భారత్లో ప్రభావం ఉంటుందా?
ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణ సమయం రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 4:24 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు ఏడు గంటలకు పైగా సుదీర్ఘ వ్యవధిలో సాగే ఈ ఖగోళ వింతను అత్యంత అరుదైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. గ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడంతో ఇక్కడ ప్రభావం అంతగా ఉండదు. గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహా సముద్రం, స్పెయిన్, పోర్చుగల్లో గ్రహణం కన్పించనుంది.




