పామ్ ఆయిల్‌ను హోటల్స్, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాడుతుంటారు. కానీ, ఇందులో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెలోని ధమనుల్లో ప్లాట్ పేరుకుపోయేందుకు దారి తీస్తాయి. ఈ నూనెతో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్, సోయాబీన్, కార్న్ ఆయిల్ తయారీ ప్రక్రియలో సహజ పోషకాలను కోల్పోతాయి. వాటిలో రసాయన అవశేషాలు, ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్ చేరడంతో శరీరానికి హాని చేకూరుతుంది.