బంగ్లాదేశ్‌లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి. ఇద్దరిని దారుణంగా చంపారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్తులు భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది.