TG: హైదరాబాద్ నగర ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రత మరువొద్దని చెప్పారు. 'పండుగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుంది. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్‌డేట్స్ పెట్టకండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. అనుమానం వస్తే డయల్ 100కి కాల్ చేయండి. మీ భద్రతే మా బాధ్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!' అని తెలిపారు.