మామిడి సీజన్‌లో మార్కెట్‌లో లభించే పండ్లు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటిపై రసాయన అవశేషాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో పండించేందుకు ఉపయోగించే కెమికల్స్ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. పండ్లు తినే ముందు శుభ్రం చేయడం అత్యంత అవసరం. ముందుగా ప్రవహించే నీటిలో బాగా కడిగి, తర్వాత కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా కలిపితే రసాయన అవశేషాలు తొలగే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రిజ్‌లో నిల్వచేసి, తినే ముందు మళ్లీ కడగడం మంచిది.