
వరదల్లో చిక్కుకున్న గర్భిణి.. కాపాడిన NDRF
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 9 నెలల గర్భిణి భూమికను NDRF సిబ్బంది కాపాడారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొండ మండలం అన్నవరం గ్రామం జలదిగ్బంధమైంది. దాంతో NDRF, వైద్యారోగ్యశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గర్భిణిని ఒడ్డు దాటించి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.




