
అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి: తల్లి శవాన్ని స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన కొడుకు
బీహార్‌లోని అక్బర్పూర్లో అజయ్ సావో అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తల్లి డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వాలని కోరగా ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. స్ట్రెచర్ కోసం అజయ్ తన భార్య, కుమారుడిని హామీగా ఉంచి, డెడ్ బాడీ ఇంటికి తీసుకెళ్లి, తిరిగి స్ట్రెచర్‌ను ఆసుపత్రికి ఇచ్చి, తన వారిని తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై బంధువులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.




