
తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
TG: తీన్మార్ మల్లన్న ఆఫీస్(క్యూ న్యూస్) ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. సాయి అనే యువకుడు గురువారం మధ్యాహ్నం బోడుప్పల్‌లోని క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చాడు. క్యూ న్యూస్ సిబ్బందిని కలిసి.. బీసీ రిజర్వేష అంశంపై మల్లన్నతో మాట్లాడటానికి వచ్చానని చెప్పినట్లు సమాచారం. అయితే.. మల్లన్న ఆఫీసులో లేరని చెప్పడంతో బయటకు వచ్చిన యువకుడు కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గాయపడిన ఆ యువకున్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




