కొంతమందికి నిద్రలేవడంతోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటి వారు తులసి, పుదీనా, రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ ఒక కప్పు కషాయం తీసుకుంటుంటే నెలరోజుల్లో సమస్య తీరిపోతుంది. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండటం వల్ల.. తుమ్ములు ఆగుతాయి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం పూర్తి ఉపశమనం ఇస్తుంది.