నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారా?.. కారణం ఇదే!

41చూసినవారు
నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారా?.. కారణం ఇదే!
నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఒక్కసారిగా శరీరం కదలడం, ఉలిక్కిపడి లేవడం లేదా ఎత్తు నుంచి పడిపోతున్నట్లు అనిపించడాన్ని ‘హిప్నిక్ జర్క్’ లేదా ‘స్లీప్ స్టార్ట్’ అంటారు. నిద్ర, మెలకువ మధ్య దశలో కండరాలు ఆకస్మికంగా సంకోచించడం వల్ల ఇది జరుగుతుంది. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు. అయితే ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, అధిక కెఫీన్ తీసుకోవడం వంటి కారణాలతో తరచుగా సంభవించవచ్చు. నిద్రకు ముందు కెఫీన్ తగ్గించడం, క్రమబద్ధమైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటివి చేస్తే ఈ సమస్య రాదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్