ప్రస్తుతం వృద్ధుల నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతుంటారు. రోగాన్ని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. సమ్మర్ మొదలవడంతో కూల్ వాటర్‌తో ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు. అయితే ఇలా చేయడం మంచిదికాదని వైద్యులు చెబుతున్నారు. చల్లని నీరు ట్యాబ్లెట్స్ త్వరగా కరగడాన్ని తగ్గిస్తుందని కాబట్టి మందులు త్వరగా శోషణం కావాలంటే సాధారణ నీటితో తీసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు.