పీరియడ్స్ రాకుండా పిల్స్ వాడితే డేంజర్ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్స్‌లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉండి తాత్కాలికంగా రుతుక్రమాన్ని ఆపుతాయి. కానీ తరచుగా వాడితే సైకిల్ డిస్టర్బ్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లోటింగ్, వాటర్ రిటెన్షన్, బరువు పెరగడం, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా i-Pill లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మాత్రలు తరచుగా వాడితే భవిష్యత్తులో ఫెర్టిలిటీ సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడకూడదు.