పుణెకు చెందిన 9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న ఎల్‌ఈడీ బల్బును ఆర్మీ డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. నేలపై పడి ఉన్న బల్బును మింగిన చిన్నారి, అది ఊపిరితిత్తిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిస్ సైన్స్‌కు తరలించారు. బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్లు బల్బును బయటకు తీయడంతో చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయి. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.