చనిపోయిన కొన్ని గంటలకే తండ్రైన ఆర్మీ జవాన్.. గుండెలు పగిలే బాధ!

32చూసినవారు
మహారాష్ట్రలోని సతారాకు చెందిన ఆర్మీ జవాన్ మరణించిన కొన్ని గంటలకే తండ్రయ్యారు. ప్రమోద్ పితృత్వ సెలవులు తీసుకుని గ్రామానికి వచ్చారు. భార్యను ఆస్పత్రిలో అడ్మిట్ చేసి బైకుపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆయన చనిపోయిన 3-4 గంటలకే భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బంధువులు భార్య, బిడ్డను శ్మశానానికి తీసుకురాగా.. స్ట్రెచర్‌పై నుంచే భర్తను చివరి చూపు చూసింది. ఈ ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది.

సంబంధిత పోస్ట్