అమెరికాలో గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు పిలిచి, అక్కడికెళ్లిన అభ్యర్థులను అరెస్టు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా శాన్‌డియాగో USCIS కార్యాలయంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీసా గడువు ముగిసిన (ఓవర్‌స్టే) వలసదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీరిలో అమెరికా పౌరులను వివాహం చేసుకున్నవారూ ఉన్నారని న్యాయవాదులు తెలిపారు. ఈ అరెస్టులు చట్టబద్ధమైనవేనని ICE స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినవారు ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు తప్పనిసరిగా న్యాయవాదిని సంప్రదించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.