
సన్ ఫార్మా భారీ డీల్.. దిలీప్ సంఘ్వీ సంపదకు రెక్కలు
భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా, అమెరికన్ సంస్థ ఆర్గానన్ను సుమారు రూ.1 లక్ష కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో, కంపెనీ ఫౌండర్ దిలీప్ సంఘ్వీ సంపద గణనీయంగా పెరిగింది. ఈ వార్తలతో సోమవారం ట్రేడింగ్లో సన్ ఫార్మా షేర్లు 9 శాతం వరకు లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.35,201.47 కోట్లు పెరిగి రూ.4,23,917.44 కోట్లకు చేరింది. దిలీప్ సంఘ్వీ వ్యక్తిగత సంపద 1.6 బిలియన్ డాలర్లు పెరిగి 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.




