కృత్రిమ మేధతో త్వరలోనే మానవాళికి పెను ముప్పు

10చూసినవారు
కృత్రిమ మేధతో త్వరలోనే మానవాళికి పెను ముప్పు
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’గా గుర్తింపు పొందిన నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్, కృత్రిమ మేధ వల్ల సమీప భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు పొంచి ఉందని తీవ్రంగా హెచ్చరించారు. ‘ఏఐ: ప్రాబబ్లీ నథింగ్ టు వరీ’ అనే డాక్యుమెంటరీ ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది లేదా 2027 నాటికి ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏఐని సృష్టించకుండా ఉంటేనే బాగుండేదని అభిప్రాయపడిన ఆయన, ఏఐ అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఈ ప్రమాదాన్ని త్వరలోనే గుర్తిస్తాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్