
దేశంలో విద్యార్థుల్లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?
దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 8,000 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేనట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. కానీ ఈ పాఠశాలల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి స్కూళ్లు 3,812 ఉండగా, 17,965 మంది టీచర్లు పనిచేస్తున్నారట. తెలంగాణలో 2,245 పాఠశాలల్లో 1,016 మంది ఉపాధ్యాయులు ఉన్నారట. మరోవైపు దేశవ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఒక్క టీచరున్న పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపింది.




