ఉద్యోగాల కోసం మంత్రి కాళ్లపై పడ్డ కళాకారులు.. రవీంద్రభారతి వద్ద ఆందోళన

12చూసినవారు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం రవీంద్రభారతి వద్ద ఉద్యమ కళాకారులు ఆందోళనకు దిగారు. సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకుని, రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కొందరు కళాకారులు మంత్రి కాళ్లపై పడి వేడుకున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్