అరుణాచల్ లోని పసిఘాట్‌లోని మెబో, సిగర్ ప్రాంతాలలో అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంటలను అదుపు చేయడానికి భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ((IAF) Mi-17 V5) సాయంతో మంటలను అదుపు చేయడానికి 66,000 లీటర్ల నీటిని మంటలపై వదిలారు. హెలికాప్టర్‌తో మంటలను ఆర్పడానికి చేసిన ప్రయత్నాలను వైమానిక దళం సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పంచుకుంది.