అరుణాచల్ భారత్ అంతర్భాగం: చైనాకు భారత్ గట్టి కౌంటర్

12328చూసినవారు
అరుణాచల్ భారత్ అంతర్భాగం: చైనాకు భారత్ గట్టి కౌంటర్
లండన్ నుంచి జపాన్‌కు వెళ్తున్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళ పెమా వాంగ్‌జోమ్ థోంగ్‌డోక్‌ను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు నిర్భందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, 'అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరానిది. ఇది స్పష్టమైన వాస్తవం. చైనా ఎంతగా తిరస్కరించినా ఈ వివాదరహిత వాస్తవం మారదు' అని గట్టిగా బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్