తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'మిరాయ్' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాఖలో సోమవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడుతూ "మీరున్నంత వరకూ నాకేం కాదు. చెట్టు పేరు చెప్పుకొని అమ్ముడుపోయేందుకు నేను కాయో, పండో కాదు.. మనోజ్‌ని. నా రీ ఎంట్రీకి మిరాయ్ సినిమా సరైనది. బ్లాక్ స్వార్డ్ పాత్రలో నటించా. తేజ సజ్జ ప్రతిభకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంది" అని అన్నారు.