ఇంగ్లాండ్ తో పెర్త్‌లో జరగనున్న మొదటి యాషెస్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించింది. ఇందులో బ్రెండన్ డాగెట్, జేక్ వెదరాల్డ్ అనే ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. 14 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా తరపున ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. జేక్ వెదరాల్డ్ ఓపెనింగ్ బ్యాట్సమెన్ కాగా బ్రెండన్ డాగెట్ ఫాస్ట్ బౌలర్. ఇక ఈ మ్యాచ్ కు పాట్ కమ్మిన్స్ దూరమైన విషయం తెలిసిందే.