పంజాబ్లోని ఫరీద్ కోట్లో ఐదేళ్ల మనవరాలిని మండుటెండలో గేటుకు కట్టేసిన ఏఎస్ఐ సరబ్ జిత్ కౌర్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించినందుకు ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోర్చుగల్లో ఉండటంతో ఆమె పట్ల సరబ్ జిత్ దారుణంగా ప్రవర్తించాడు. స్థానికులు తీసిన వీడియో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి చేరింది. ప్రస్తుతం ఆ చిన్నారిని శిశు సంరక్షణ కమిటీకి అప్పగించి విచారణ చేపట్టారు.