ఆసియా కప్ 2025 ఫైనల్లో ఆదివారం భారత్, పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు.