ఆసియా కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ తుది పోరులో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా దూరమయ్యాడు. తుది జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.