2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ట్రోఫీతో ఫోటోషూట్, ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలేదు. భారత జట్టు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేందుకు ప్రాక్టీస్ చేయలేదు. పాకిస్తాన్ జట్టు విలేకరుల సమావేశం రాత్రి 7:30 గంటలకు జరగనుంది.