
దేశంలో అగ్రశ్రీమంతుడు ఎవరో తెలుసా..!
ముకేశ్ అంబానీ దేశీయ శ్రీమంతుల జాబితాలో తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఎం3ఎం హురున్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. రూ.9.55 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది రూ.11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానానికి పడిపోయారు. హెచ్సీఎల్ చైర్మన్ రోష్నీ శివ్ నాడార్ రూ.2.84 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.




