ప్రపంచ వృద్ధికి ఆసియా నాయకత్వం, టాప్‌లో భారత నగరాలు

6991చూసినవారు
ప్రపంచ వృద్ధికి ఆసియా నాయకత్వం, టాప్‌లో భారత నగరాలు
ప్రపంచంలోనే అత్యుత్తమ వృద్ధి ప్రాంతంగా ఆసియా నిలిచిందని 2024 ‘సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్’ వెల్లడించింది. అధిక ఆర్థిక సామర్థ్యం, జనాభా వృద్ధి, పెరుగుతున్న సంపదతో ఆసియా నగరాలు గ్లోబల్ ఎకానమీకి చోదక శక్తులుగా మారనున్నాయి. 2033 నాటికి కీలక పట్టణాల జాబితాలో భారత్‌కు చెందిన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై అగ్రస్థానాల్లో నిలిచాయి. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, పెట్టుబడుల కలయికతో ఆసియా ప్రపంచ వృద్ధికి నాయకత్వం వహిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Job Suitcase

Jobs near you