ఆసియా క్రీడలు-2026లో భారత షూటర్ ఎలవెనిల్ వలరివాన్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో 252.4 పాయింట్లతో రజత పతకం సాధించింది. స్వర్ణ పతక విజేత జపాన్‌కు చెందిన తైచి హినాతా 253.0 పాయింట్లు సాధించగా.. ఎలవెనిల్ కేవలం 0.6 పాయింట్ల తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుంది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ 230.4 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. ఇప్పటికే టీమ్ విభాగంలోనూ ఎలవెనిల్ రజతం సాధించింది.