జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు 1-2 తేడాతో ఓటమిపాలయ్యాయి. పురుషుల జట్టు మలేషియా చేతిలో, మహిళల జట్టు హాంగ్కాంగ్ చేతిలో పరాజయం చవిచూశాయి. గత ఎడిషన్లో స్వర్ణం సాధించిన భారత పురుషుల జట్టు ఈసారి ఫైనల్కు చేరలేకపోయింది. అభయ్ సింగ్ ఓడినప్పటికీ.. వీర్ చోత్రాని విజయం సాధించి స్కోరును 1-1తో సమం చేశాడు. నిర్ణయాత్మక పోరులో మలేషియా గెలిచింది.