ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల కబడ్డీ జట్టు తమ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా, తొలి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌ను 49-24 తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం. మొదటి హాఫ్‌లో అస్లామ్ ఇనామ్‌దార్, ఆశు మాలిక్, అయాన్ లోచబ్ అద్భుత ఆటతీరుతో
భారత్ 31-9 ఆధిక్యం సాధించింది. రెండో హాఫ్‌లోనూ
భారత్ జోరు కొనసాగి 18 పాయింట్లు సాధించింది. పవన్ సెహ్రావత్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అస్లామ్ ఇనామ్‌దార్ కీలక పాత్ర పోషించాడు.