ఏషియన్ గేమ్స్‌లో భాగంగా శనివారం కబడ్డీలో
భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించే అవకాశం ఉంది. ఉదయం 9:30 గంటలకు మహిళల జట్టు, మధ్యాహ్నం 2:30 గంటలకు పురుషుల జట్టు ఇరాన్ జట్లతో తలపడనున్నాయి. మరోవైపు, రెండుసార్లు స్వర్ణం సాధించిన తజిందర్‌పాల్ సింగ్ షాట్‌పుట్ ఫైనల్లో పోటీ పడనున్నారు. పురుషుల మారథాన్, షూటింగ్ టీమ్, పురుషులు & మహిళల 400మీ, మహిళల 1500మీ ఫైనల్స్ కూడా నేడు జరగనున్నాయి.