ఏషియన్ గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం

14163చూసినవారు
ఏషియన్ గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో పతకం లభించింది. రెండో రోజు పోటీల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్‌, పార్థ్‌ మానే, రుద్రాంక్ష్‌ పాటిల్‌తో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. చైనా స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. తొలి రోజు కూడా షూటింగ్‌లోనే రెండు రజతాలు వచ్చాయి. మహిళల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌ వలరివన్‌, టీమ్‌ విభాగంలో సోనమ్‌ మస్కర్‌, విదర్సా వినోద్‌, ఎలావెనిల్‌ వలరివన్‌ రజతాలు సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్