కజిస్థాన్ వేదికగా 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్ పసిడి గెలుచుకున్నారు. ఫైనల్‌లో చైనా జోడీని వెనక్కి నెట్టి గోల్డ్ కొల్లగొట్టారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఉమెన్స్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో వలరివన్ పసిడి సంపాదించగా.. టీమ్ ఈవెంట్‌ల బబుతా, పాటిల్, కిరణ్ బంగారు పతకాలు సాధించారు.