TG: పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణముండాలని సీఎం రేవంత్ అన్నారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 'సభా గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సభ్యులకు మరింత ప్రైవసీ ఉండాలి. పబ్లిక్ గార్డెన్‌లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు చేయాలి. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలి' అని ఆదేశించారు.