అటల్ పెన్షన్ యోజన.. ప్రతీ నెలా రూ.5వేలు

17751చూసినవారు
అటల్ పెన్షన్ యోజన.. ప్రతీ నెలా రూ.5వేలు
వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY)ను అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు నెలకు రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించడం ద్వారా, 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. చందాదారు మరణిస్తే, వారి భాగస్వామికి జీవితకాలం పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే, 60 ఏళ్ల వరకు జమ అయిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.

సంబంధిత పోస్ట్