ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఏథర్ ఎనర్జీ సంచలనం సృష్టించింది. ఆగస్టు మొదటి 21 రోజుల్లో కంపెనీ 17 శాతం మార్కెట్ షేరుతో రెండో స్థానంలో నిలిచింది. 25 శాతం మార్కెట్ షేరుతో ప్రస్తుతం టీవీఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 శాతం మార్కెట్ షేరుతో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత్ మార్కెట్‌లో బలమైన పట్టున్న ఏథర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తుండటంతో అమ్మకాలు పెరిగాయి.