ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్కు అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ అతిశీని కోరారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా సీఎం పదవిని చేపట్టిన ఆతిశీ.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.