
మద్యం తాగొద్దని మందలించినందుకు ఆత్మహత్య
TG: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి ప్రభాకర్ (64) అనే వృద్ధుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అతిగా మద్యం తాగడం అలవాటు ఉన్న ప్రభాకర్‌ను కుటుంబ సభ్యులు మందలించగా, మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడ్డారని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. భార్య రాజేశ్వరి, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.




