AP: ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణ హత్య జరిగింది. వంతెన డౌన్‌లోని రజకపాలెంకు చెందిన నీలాపు వీరబాబు (37)ను యాదవపాలెంకు చెందిన నవీన్, అతని బంధువు కృష్ణ కత్తితో దాడి చేసి హతమార్చారు. డబ్బు వ్యవహారంపై వీరబాబు, నవీన్ మధ్య తగాదా జరిగింది. కోపంతో తల్లి కళ్లముందే గొంతుకోసి చంపేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పు ఇప్పించలేదనే ఇలా చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.