ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా సుథా గ్రామంలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంపై పట్టు సాధించాలనే దుర్బుద్ధితోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి గుడిలో నిద్రిస్తున్న బాబా గోపాల్ దాస్, బాబా బిహారీ దాస్ అనే వృద్ధ సాధువులపై సుమిత్ సింగ్ (35) ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు మృతదేహాలకు నిప్పు అంటించి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఖుదాగంజ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వాడిన ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.