దారుణం: తల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసిన కూతురు

38చూసినవారు
దారుణం: తల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసిన కూతురు
TG: హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లీలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. 42 ఏళ్ల మాధవి తన తల్లి లక్ష్మి (82)ని ఇనుపరాడ్డుతో కొట్టి చంపింది. సోమవారం రాత్రి తల్లి–కుమార్తెల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన మాధవి మంగళవారం ఈ దారుణానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తల్లి, కుమార్తె ఇద్దరికీ మతిస్థిమితం లేనిదని పొరుగువారు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you