అస్సాం రాజధాని గువాహటిలోని ఖానాపారా ప్రాంతంలో ఒక నైట్‌క్లబ్‌లో దారుణం జరిగింది. యువతిని నేలపైకి తోసేసి, బట్టలు విప్పి తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా, పురుష బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని క్లబ్ నాలుగో అంతస్తు నుంచి పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. ఘర్షణకు గల కారణాలు, బాధితురాలి వివరాలు తెలియరాలేదు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నైట్‌క్లబ్‌ను మూసివేశారు.