AP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో దారుణ హత్య చోటుచేసుకుంది. అక్కడి అల్ ఖైర్ ఫంక్షన్ హాలుకు హమీద్, హనీఫ్, ఉమర్ అనే యువకులు ఉమ్మడి భాగస్వాములు. అయితే ఈఫంక్షన్ హాలు నిర్వహణలో వారి మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హమీద్ తన ఆర్థిక లావాదేవీలను పరిష్కరించకుండా ఫంక్షన్ హాల్ నడిపే ప్రసక్తే ఉండకూడదని తాళాలు వేశాడు. విషయం తెలుసుకున్న హనీఫ్, ఉమర్ రాడ్డు, కత్తులతో వచ్చి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు.